Natural Hair Care: జ‌ట్టు స‌మ‌స్య‌ల‌కు కాక‌ర‌కాయ ర‌సం స‌హ‌జ ప‌రిష్కారం.. 10 month ago

featured-image

కాకరకాయ జుట్టు సంరక్షణకు సహాయపడే ఒక సహజమైన ప్రకృతి ఔష‌ధం. దీనిలో అనేక ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నాయి. వీటి వల్ల జుట్టు సమస్యలను పరిష్కరించడం చాలా సులభం. కాకరకాయ జుట్టు పెరుగుదల, తెల్ల జుట్టు, చుండ్రు, జిడ్డు వంటి అనేక సమస్యలకు మంచి పరిష్కారంగా పనిచేస్తుంది. ఇది జుట్టు కుదుళ్ల‌ను బలపరచి, తేమను మెరుగుపరుస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. 


తెల్లజుట్టుకు ప‌రిష్కారం(white hair):

చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడిన వారికి కాకరకాయ రసం చ‌క్క‌టి ప‌రిష్కార మార్గం. కాకరకాయ రసాన్ని జుట్టు మీద రాసి, దాన్ని గంటపాటు ఆరనివ్వాలి. తర్వాత నీటితో శుభ్రం చేయడం ద్వారా తెల్ల జుట్టు సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ ప్రక్రియను వారంలో 2-3 సార్లు చేయాలి. కాకరకాయలో ఉండే విటమిన్లు, మినరల్స్ కేశాల రంగును పునరుద్ధరిస్తుంది.

 

కురుల‌ చివర్లు చిట్లడం (Split ends of hair):

కురుల‌ చివర్లు చిట్లిపోతున్నప్పుడు కాకరకాయ రసాన్ని పట్టించి 50 నిమిషాలు ఉంచాలి. తర్వాత వేడినీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ఈ సమస్యను తగ్గించవచ్చు. ప్రస్తుత కాలుష్యం, వాతావరణ మార్పులతో ఈ సమస్య సాధారణంగా ఎదుర‌వుతూ ఉంటుంది.




చుండ్రు(dandruff):

చుండ్రు సమస్యకు కూడా కాకరకాయ మంచి విరుగుడు అనే చెప్పాలి. కొంచెం జీలకర్ర పేస్ట్‌తో కాకరకాయ రసాన్ని కలిపి దానిని మాడుకు అప్లై చేయాలి. ఈ ప్రక్రియను వారానికి రెండుమూడుసార్లు చేయడం ద్వారా చుండ్రు తగ్గించుకోవచ్చు.

 

జుట్టు పెరుగుదల(hair growth):

కాక‌ర‌కాయ ర‌సంలో ఉన్న విటమిన్లు, ఖనిజాలు కురుల కుదుళ్ల‌ను బలపరుస్తాయి. చుండ్రును తగ్గించి, జుట్టు నష్టం ఆపుతుంది. కాకరకాయ రసాన్ని జుట్టులో రాసి 30 నిమిషాలు ఉంచి, శుభ్రంగా కడిగితే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. తరచుగా వాడడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.


ఆయిలీ హెయిర్(Oily hair):

ఆయిలీ హెయిర్ ప‌రిష్కారానికి కాకరకాయ ర‌సం ఉపయోగించవచ్చు. కాకరకాయ రసాన్ని జుట్టుకి రాసి, 30 నిమిషాల పాటు వదిలి ఉంచాలి. ఇది జుట్టులో నూనెను నియంత్రించి, శుద్ధిని పెంచుతుంది.


గ‌మ‌నికః పైన అందించిన ఆరోగ్య స‌మాచారం, సూచ‌న‌లు మీ అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే చెప్పిన‌వి. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి స‌మ‌స్య‌లు ఉన్నా ముందుగా డాక్ట‌ర్‌ని సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.



ఇది చదవండి: త‌ల్లి చేయ‌ని మేలు..ఉల్లి చేస్తుంద‌ని ఇందుకే అంటారు..



Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD